
నవంబర్‌లో బతుకమ్మ చీరల పంపిణీ
మంచిర్యాలటౌన్: ప్రతియేటా కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్టు ద్వారా బతుకమ్మ పండుగకు మంచిర్యాల నియోజకవర్గంలోని ఆడపడుచులకు అందించే బతుకమ్మ చీరలను నవంబర్ 27న పంపిణీ చేయనున్నట్లు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అనారోగ్యానికి గురి కావడంతో పండుగ సమయంలో మహిళలకు బతుకమ్మ చీరలు అందించలేక పోయామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధినేత, ఎంపీ రాహుల్‌గాంధీ చేపట్టిన ఓటు చోర్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గంలో 1.50 వేల ఓటర్ల సంతకాల సేకరణ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజామాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.