
పోలింగ్ కేంద్రం మార్చాలి
కోటపల్లి: మండలంలోని సిర్సా గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏటా ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రం మార్చాలని, లేనిపక్షంలో ఎన్నికలు బహిష్కరిస్తామని గ్రామస్తులు మంగళవా రం తహసీల్దార్ రాఘవేందర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలో పోలింగ్ కేంద్రం కారణంగా డబ్బు, మద్యం బెదిరింపులతో కొంతమంది ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లోనూ దాడులు, కేసులు నమోదైన సంఘటనలు జరిగాయని గుర్తు చేశారు. గ్రామస్తుల ఏకగ్రీవ నిర్ణయాలన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. రాబోయే ఎన్నికల్లో గ్రామస్తులు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్దింటి పున్నం, హరీశ్‌రెడ్డి, సంపత్, మహేశ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.