
ఘనంగా దుర్గాదేవి చండిపూజ
మంచిర్యాలఅర్బన్: స్థానిక విశ్వనాథ ఆలయ కాలక్షేప మండపంలో సర్వజననీ దుర్గాదేవి నిర్వాహక మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి వద్ద మంగళవారం చండిపూజ ఘనంగా నిర్వహించారు. అంతకుముందు తొమ్మిది కలశాల పూజ, 108 తామ ర పూలు, 108 దీపాలు వెలిగించారు. దుర్గాష్టమి కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల బెంగాలీలు పెద్ద సంఖ్య లో తరలివచ్చారు. అమ్మవారిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మాజీ మంత్రి బోడ జనార్థన్, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, హైకోర్టు ఏజీపీ సైదం లక్ష్మీనారాయణ దర్శించుకున్నా రు. ఈ కార్యక్రమంలో సర్వజననీ దుర్గాదేవి నిర్వాహక మండలి అధ్యక్షుడు బోడ ధర్మేందర్, ఉమ్మడి జిల్లా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్వీ రమణ, కమి టీ సభ్యురాలు రీనారాణి దాస్, అత్తి సరోజ తదితరులు పాల్గొన్నారు.