
నగరంలో పోలీసుల తనిఖీలు
మంచిర్యాలక్రైం: స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఎన్నికల ని బంధనల మేరకు మంగళవారం నగరంలోని ప్రధాన కూడళ్లలో మంచిర్యాల డీసీపీ భాస్క ర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా నగదు, నగలు, మద్యం త రలించొద్దని సీఐ ప్రమోద్‌రావు తెలిపారు.
అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద
కోటపల్లి: ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు సరిహద్దు ప్రాంతాలను అప్రమత్తం చేశా రు. మండలంలోని పార్‌పల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా మద్యం, డబ్బు, ఇతరత్రా తరలింపుపై నిఘా ఉంచామని తెలిపారు.