
పంట చేలలో గంజాయి సాగు
సాత్నాల: గుట్టు చప్పుడు కాకుండా పంట చేన్లలో గంజాయి సాగు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రవణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం జైనథ్ పోలీస్‌స్టేషన్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మండలంలోని మార్గుడా గ్రామానికి చెందిన హీరా కుమ్ర కిషన్, హీరా కుమ్ర వసంత్ తమ పంట చేన్లలో గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారం రావడంతో, ఎస్సై గౌతమ్ పవర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పత్తి, కందితో పాటే కిషన్, వసంత్ గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. కిషన్ చేనులో 30, వసంత్ చేనులో నాలుగు గంజాయి మొక్కలు గుర్తించి స్వాధీనం చేసుకున్నా రు. వీటి విలువ రూ.34 లక్షలు ఉంటుందని తెలిపా రు. అక్రమంగా గంజాయి సాగు చేసే వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితులపై ఎస్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.