
అడవిలో అరుదైన నక్షత్ర తాబేలు
వేమనపల్లి: మండలంలోని నీల్వాయి అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై నీల్వాయి రేంజ్ అధికా రి హఫీజొద్దీన్, డిప్యూటి రేంజ్ అధికారి ప్రమోద్‌కుమార్‌కు అరుదైన నక్షత్ర తాబేలు (ఇండియన్ స్టార్ టార్టయిస్) లభ్యమైంది. ఇది బంగారు, బ్రౌన్ వ ర్ణంలో ఉంది. సమశీతోష్ణ వాతావరణం ఉండే మన అడవులతోపాటు పాకిస్థాన్, శ్రీలంక అడవుల్లో వీటి సంతతి ఉంటుందని అధికారులు తెలిపారు. గడ్డి, పూలు, చెట్ల అకులు తింటూ ఒంటరిగా జీవించే అ లవాటు కలిగి ఉంటుందని పేర్కొన్నారు. సుమారు 60–80 ఏళ్లు జీవించి ఉంటుందని తెలిపారు. మగ తాబేలు కంటే ఆడ తాబేలు పెద్ద పరిమాణంలో ఉంటుందన్నారు. అటవీ చట్టం ప్రకారం దీన్ని వేటాడటం, ఇళ్లలో పెంచుకునేందుకు తీసుకెళ్లటం నేరమని తెలిపారు. జాతీయంగా ఈ తాబేలు అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో ఉందని వివరించారు. ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాత దానిని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.