
బాసరలో నాలుగిళ్లలో చోరీకి యత్నం
బాసర: మండల కేంద్రంలోని వెంకటేశ్వరకాలనీలో సుమారు నాలుగిళ్లలో సోమవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి యత్నించి విఫలమయ్యారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యం చేసుకున్నారు. గతవారం బస్టాండ్ వద్ద గల ప్రియ మిల్క్ బేకరీతో పాటు మూడిళ్లలో చోరీ జరిగింది. వారం వ్యవధిలో దుండగులు నాలుగిళ్లలో చోరీకి యత్నించగా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బాసరలో వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంకటేశ్వరకాలనీ వాసులను అప్రమత్తం చేశారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని బాసర ఎస్సై శ్రీనివాస్ కోరారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల ను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఇళ్ల ముందు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు.
బాసరలో అర్ధరాత్రి ‘లేడీ’ హల్చల్
ముధోల్ మండల కేంద్రంలోని ఓ ఇంట్లో సోమవారం మిట్ట మధ్యాహ్నం సుమారు రూ.5లక్షల నగదు, ఐదు తులాల బంగారం చోరీ కాగా, ఈ ఘటన మరువక ముందే బాసరలో ఓ మహిళ అలజడి సృష్టించింది. ఒక వ్యక్తితో కలిసి ఆమె ఓ ఇంటి గోడ దూకి చోరీకి యత్నించగా సీసీ కెమెరాలో రికార్డయింది. పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

బాసరలో నాలుగిళ్లలో చోరీకి యత్నం