
బాలుడి మృతిపై కుటుంబీకుల ఆందోళన
ఖానాపూర్: వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు, బంధువులు ఖానాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన అనిత–రాజు దంపతుల నెలన్నర కుమారుడు అయన్స్‌కు జ్వరం రావడంతో ఈ నెల 21నుంచి 26వరకు ఖానాపూర్‌లోను మెడికేర్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. చికిత్స సమయంలో బాలుడి చేతికి సైలెన్ పెట్టిన క్యానిల ప్రాంతంలో వాపు వచ్చి ఇన్‌ఫెక్షన్ అయింది. ఈ విషయమై వైద్యులు, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సమస్య తీవ్రమైంది. దీంతో 26న వైద్యుడి సూచన మేరకు నిర్మల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా పరిస్థితి విషమించింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలి స్తుండగా మార్గమధ్యలో సోమవారం రాత్రి 11గంటల ప్రాంతంలో బాలుడు మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబీకులు, బంధువులు మంగళవారం మెడికేర్ ఆస్పత్రికి సిబ్బందిని నిలదీసి ఫర్నిచర్, రిషెప్షన్ కౌంటర్ ధ్వంసానికి యత్నించగా పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందు కున్న ఖానాపూర్, పెంబి, కడెం ఎస్సైలు రాహుల్ గైక్వాడ్, హన్మాండ్లు, సాయికిరణ్, సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వారిని సముదాయించగా ఆందోళన సద్దుమణిగింది.

బాలుడి మృతిపై కుటుంబీకుల ఆందోళన