
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు ప్రారంభం
మంచిర్యాలఅర్బన్/జన్నారం/నస్పూర్/మందమర్రిరూరల్: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఏటీసీ (అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్)లను శనివారం ప్రారంభించారు. మంచిర్యాల ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏటీసీని కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించగా, కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్ తదితరులున్నారు. జన్నారం మండలం కిష్టాపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఏటీసీని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, అదనపు కలెక్టర్ చంద్రయ్యతో కలిసి ప్రారంభించారు. వారి వెంట తహసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రాములు, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ రవి తదితరులున్నారు. నస్పూర్ పట్టణ పరిధిలోని ప్రగతినగర్ ఏటీసీ సెంటర్ ప్రారంభోత్సవానికి బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ హాజరు కాగా, కార్యక్రమంలో టీజీఐఐసీ జనరల్ మేనేజర్ మహేశ్వర్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ సుజాత, ఏటీసీ ఇన్‌చార్జి రాజమౌళి, తహసీల్దార్ సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు. మందమర్రి ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏటీసీని మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు ప్రారంభించగా, ఆయన వెంట తహసీల్దార్ సతీశ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, ఐటీఐ, ఏటీసీ సెంటర్ సిబ్బంది ఉన్నారు.