అవకాశాలను అంది పుచ్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అవకాశాలను అంది పుచ్చుకోవాలి

Sep 19 2025 2:44 AM | Updated on Sep 19 2025 2:44 AM

అవకాశాలను అంది పుచ్చుకోవాలి

అవకాశాలను అంది పుచ్చుకోవాలి

చెన్నూర్‌రూరల్‌: విద్యార్థులు అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని కమిషనరేట్‌ ఆఫ్‌ కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఆచార్య రాజేంద్రసింగ్‌ అన్నారు. మండలంలోని కిష్టంపేట గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను గురువారం ఆయన సందర్శించారు. నూతన విద్యార్థుల స్వాగత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థులు లక్ష్యాన్ని సాధించి ఉన్నత స్థానాలకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.వి.పట్వర్దన్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎం.కిశోర్‌కుమార్‌, అధ్యాపకులు చక్రపాణి, కృష్ణారెడ్డి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement