
40 శాతం లాభాల వాటా చెల్లించాలి
శ్రీరాంపూర్: సింగరేణి గడిచిన ఆర్థిక సంవత్సరం సాధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి 40 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. గురువారం నస్పూర్ కాలనీలోని ఆ యూనియన్ కార్యాలయంలో మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం ముగిసి 6 నెలలు కావస్తున్నా ఇప్పటికీ లాభాల లెక్క తేల్చలేదన్నారు. కార్మికులు కష్టపడి పని చేస్తేనే లాభాలు వచ్చాయని, వాటా పంచడానికి జాప్యం ఎందుకు చేస్తున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్‌రెడ్డి, నాయకులు రాగం రాజేందర్, మంద కమలాకర్, మేకల స్వామి తిరుపతి, మోతే ఓదెలు, రాజు, చెల్లా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.