
ఎనిమిది నెలలుగా జీతాల్లేవ్!
అతిథి అధ్యాపకులకు అందని వేతనాలు పండుగకై నా ఇవ్వాలని వేడుకోలు ఉమ్మడి జిల్లాలో 225 మంది అతిథి అధ్యాపకులు
లక్ష్మణచాంద: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిఽథి అధ్యాపకులు రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది డిసెంబర్ మాసం నుంచి వారికి వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చాలీచాలని వేతనాలతో...
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు చాలీచాలని వేతనాలతోనే కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. పీరియడ్‌కు రూ.390 చొప్పున నెలకు 72 పీరియడ్లు విద్యార్థులకు పాఠాలు బోధించాల్సి ఉంటుంది. నెలలో 72 పీరియడ్‌లు బోధిస్తే రూ.28,080 వేతనం వస్తుంది. రెగ్యులర్ అధ్యాపకులకు సరిసమానంగా పనిచేస్తున్నా అరకొర వేతనాలే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ పోషణకు అప్పులు
గతేడాది డిసెంబర్ నుంచి వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణకు ఇతరుల వద్ద అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అతిథి అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వెంటనే తమకు రావాల్సిన ఎనిమిది నెలల వేతనాలు చెల్లించి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు. లేదంటే దసరా పండుగకు తమ కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన చెందుతున్నారు.
ఉమ్మడి జిల్లా వివరాలు
జిల్లా గెస్ట్ లెక్చరర్లు
నిర్మల్ 55
ఆదిలాబాద్ 69
ఆసిఫాబాద్ 61
మంచిర్యాల 40
మొత్తం 225