
భార్య కాపురానికి రావడంలేదని ఆత్మహత్య
బెల్లంపల్లి: భార్య కాపురానికి రావడం లేదని ఉరేసుకుని భర్త ఆత్మహత్య చే సుకున్న సంఘటన పట్ట ణంలో చోటు చేసుకుంది. టూటౌన్ ఎస్సై సీహెచ్ కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని రడగంబాల బస్తీకి చెందిన కుజ్జూర్ పృథ్వీరాజ్ (37)కు తాళ్లపల్లి సుప్రియతో 2018లో వివాహమైంది. అప్పటి నుంచి పృథ్వీరాజ్ తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి గొడవపడేవాడు. దీంతో సుప్రియ గత జూన్‌లో మంచిర్యాలకు వెళ్లిపోయింది. ఇంటికి రావాలని పలుమార్లు కోరినా నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతునికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని తల్లి కుజ్జూర్ కల్పన ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.