
పోలీసులపై దాడి కేసులో ఒకరి అరెస్టు
ఇచ్చోడ: మండలంలోని కేశవపట్నంలో గత నెలలో ముల్తానీలు పోలీసులపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. మండలంలోని చెలుకగూడ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటే క్రమంలో కేశవపట్నం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులతో కలిసి ప్రధాన నిందితుడు అల్తాఫ్ పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో స్థానిక ఎస్సైతో పాటు ఐదుగురు స్పెషల్ పార్టీ పోలీసులు గాయాల పాలయ్యారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అల్తాఫ్‌ను గురువారం సిరిచెల్మలో అరెస్ట్ చేసినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. కాగా నిందితుడిపై ఇప్పటికే 8 కేసులు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు.
మంచిర్యాలలో నకిలీ సిగరేట్లు!
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో నకిలీ సిగరేట్లు కలకలం రేపాయి. ఇంటర్నేషనల్ కార్పొరేట్ విజి లెన్స్ అధికారులు గురువారం పట్టణంలోని పలు కిరాణా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. కృష్ణ జనరల్ స్టోర్స్, పవన్ కిరాణ స్టోర్స్‌లో నకిలీ గోల్డ్‌ఫ్లాక్ సిగరేట్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో విజిలెన్స్ అధికారులు నాగేశ్వర్‌రావు, రమాకాంత్, స్థానిక ఎస్సై తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.
పొచ్చెర జలపాతంలో రివర్ రాఫ్టింగ్
బోథ్: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొచ్చెర జలపాతం వద్ద గురువారం రివర్ రాఫ్టింగ్ నిర్వహించారు. పొచ్చెర నుంచి కుప్టి వరకు సు మారు 6 కిలోమీటర్ల దూరాన్ని ఒకటిన్నర గంటల వ్యవధిలో ట్రయల్ రాఫ్టింగ్ చేశారు. వర్షాకాలంలో రాఫ్టింగ్ నిర్వహించేందుకు అటవీ అధికారులు చేసిన ప్రతిపాదనలపై శుక్రవారం జరగబోయే టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ జిల్లా సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉందని అఽధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బోథ్ ఎఫ్‌ఆర్‌వో ప్రణయ్, ఇంద్రవెల్లి ఎఫ్‌ఆర్‌వో సంతోష్, కోయినా అడ్వెంచర్ టీమ్, రివర్ రాఫ్టింగ్ సభ్యులు పాల్గొన్నారు.