
జిల్లాస్థాయి వాలీబాల్ ఎంపిక పోటీలు
జన్నారం: మండల కేంద్రంలోని స్లేట్ ఎక్స్‌లెంట్ పాఠశాలలో గురువారం ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్–17 జిల్లాస్థాయి బాలుర వాలీబాల్ ఎంపిక పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సుమారు 200 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు అక్టోబర్‌లో ఆదిలాబాద్‌లో నిర్వహించనున్న జోనల్‌స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో విజయ్‌కుమార్, ఎస్సై గొల్లపెల్లి అనూష, ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి యాకూబ్, స్లేట్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు సుభాష్‌రెడ్డి, చైర్మన్ ఏనుగు శ్రీకాంత్‌రెడ్డి, ఫణిరాజు, ఎస్జీఎఫ్ నాయకులు బెల్లం శ్రీనివాస్, గాజుల శ్రీనివాస్, సిరంగి గోపాల్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రోజీ వరకుమారి, సాగర్, పీడీలు సంతోష్, నగేష్, తదితరులు పాల్గొన్నారు.
జోనల్ స్థాయికి ఎంపికై ంది వీరే..
జిల్లాస్థాయి పోటీలలో ప్రతిభ కనబర్చిన 18 మంది జోనల్ స్థాయికి ఎంపికై నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి యాకూబ్ తెలిపారు. ఎంపికై న వారిలో రాకేశ్, ప్రణయ్ (ముల్కళ్ల), కార్తీక్, అనిల్ (కొత్తపల్లి), సాయి ప్రదీప్ (మంచిర్యాల), సాయి దీక్షిత్ (మంచిర్యాల), ఇలియాజ్‌ఖాన్ (తాళ్లపేట్), విగ్నేశ్ (రెబ్బనపల్లి), ఘనతేజ, అరుణ్ (లక్సెట్టిపేట), అఖిలేశ్, రుతిన్(బెల్లంపల్లి), భానుచందర్, దిలీప్ (జన్నారం), అజయ్ (చింతగూడ), ప్రణయ్‌కుమార్ (జైపూర్) అధ్వైత్ (గర్మిళ్ల), వర్షిత్ (వెంకటపూర్) ఉన్నారు.