
‘గడ్డెన్నవాగు’కు భారీ ఇన్‌ఫ్లో
భైంసా పట్టణ శివారులోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోగా అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. గురువారం ఉదయం ప్రాజెక్టుకు 13,277 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా వచ్చిన నీటిని వచ్చినట్లు విడుదల చేశారు. సాయంత్రం ఇన్‌ఫ్లో తగ్గడంతో ఒక గేటును మూసి, ఒక గేట్ ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లకుగానూ ప్రస్తుతం 358.40 మీటర్ల నీటినిల్వ ఉంది. – భైంసాటౌన్