
అపోహలను తొలగించే జానపద ప్రచారాలు
చెన్నూర్: జానపద ప్రచారాలు అపోహలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయని డీఎంహెచ్‌వో అనిత అన్నారు. స్థానిక సీహెచ్‌సీలో ఎస్‌ఎన్‌ఎస్‌పీఏ కార్యక్రమంలో భాగంగా బుధవారం హెచ్‌ఐవీ, ఎయిడ్స్ కోసం సమీకృత వ్యూహం, అవగాహన సదస్సు నిర్వహించారు. జానపద కళాకారులు పాటల ద్వారా హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కల్పించారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ సాంప్రదాయ జానపద మీడియా ద్వారా నృత్యం, కళారూపాలను వినియోగించి ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. పీవో సుధాకర్‌నాయక్ మాట్లాడుతూ మొబైల్ పరీక్షలు, కౌన్సెలింగ్ సేవలపై జానపద పదర్శనలతో పూర్తి సమాచారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జానపద కళాకారులు, రోగులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.