
అవసరం మేరకు యూరియా పంపిణీ
భీమారం/జైపూర్: జిల్లాలో సాగుకు అవసరమైన మేరకు యూరియా పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం భీమారం మండల కేంద్రంలోని రైతువేదికలో రైతులతో మా ట్లాడారు. మండలంలో గత ఏడాది 14 మెట్రిక్ ట న్నుల యూరియా వినియోగించారని, ఈ ఏడాది ఇ ప్పటికే 11 టన్నులు పంపిణీ చేశామని అన్నారు. మూడు నాలుగు రోజుల్లో పీఏసీఎస్, జిల్లా మార్కెటింగ్ సొసైటీల్లో యూరియా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. భీమారం, జైపూర్‌లోని కస్తూర్భాగాంధీ విద్యాలయాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. జైపూర్‌లో తరగతి గదులు, రిజిష్టర్లు, వంటసామగ్రి పరిశీలించారు.
గోదావరి వరద ఉధృతిని పర్యవేక్షించాలి
మంచిర్యాలటౌన్: గోదావరి నదిలో వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, నదిలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్డులో గోదావరి నది వరద ఉధృతిని మంగళవారం ఆయన తహసీల్దార్ రఫతుల్లా హుస్సేన్‌తో కలిసి పరిశీలించారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖ సిబ్బందిని నియమించి, నీటి పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. పాతమంచిర్యాలలో ఇందిరా మహిళా భవన్ నిర్మాణ పనులు పరిశీలించారు.