
ఆలయంలో చోరీ
ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్‌లో నర్సింహస్వామి ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయం చుట్టూ ఎలాంటి రక్షణగోడ లేకపోవడాన్ని గమనించిన గుర్తుతెలి యని వ్యక్తులు.. స్వామివారి విగ్రహంపై ఉన్న వెండినామాలు, ఇతర సామగ్రి, హుండీని పగులగొట్టి ఎత్తుకెళ్లారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కాగా, పట్టణంలోని గాంధీనగర్ శివారులో నల్లపోచమ్మ ఆలయం వద్ద ఓ దొంగ చోరీకి యత్నిస్తున్న విషయమై సీసీ ఫుటేజీ పరిశీలించిన అర్చకులు ఈశ్వర్, ఆలయకమిటీ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా, ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకుని విచారిస్తున్నట్లు సమాచారం.