
అడవిపంది దాడిలో మహిళకు తీవ్రగాయాలు
కోటపల్లి: అడవిపంది దాడిలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని వెంచపల్లిలో బొల్లవేన మధునక్క ఇంటి సమీపంలోని స్థలంలో మొక్కజొన్న పంట వేసింది. గురువారం తెల్లవారుజామునే అడవి పందిని తరిమివేస్తుండగా వేగంగా దాడి చేయడంతో గాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను చెన్నూర్ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతున్న మధునక్కను ఫారెస్టు అధికారులు పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. అడవిపంది మృతిచెందిందని తెలుసుకున్న అధికారులు పంచనామా నిర్వహించి ఖననం చేశారు. మధునక్కను గాయపర్చిన పంది అడవిపందినే అని గ్రామస్తులు తెలుపగా ఊర పంది అని ఫారెస్టు అధికారులు తెలపడం గమనార్హం. ఈ విషయమై ఫారెస్టు రేంజర్ సదానందంను వివరణ కోరగా గాయపర్చిన పంది ఊరపంది అని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయని చెప్పడం గమనార్హం.