
అప్రమత్తంగా ఉండాలి
అక్రమ ఆర్థిక లావాదేవీలు, సైబర్‌క్రైమ్, ఆన్‌లైన్ గేమింగ్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన ఆన్‌లైన్ గేమ్స్ ఆడడం, నిర్వహించడం చట్టరీత్యా నేరం. నిర్వహించినా, ఆడినా, ప్రచారం చేసినా కఠిన చర్యలు ఉంటాయి. పిల్లలు ఏం చేస్తున్నారు.. ఏ ఆటలు ఆడుతున్నారనేది తల్లిదండ్రులు గమనించాలి. ఎక్కడైనా నిషేధిత బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ గేమ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిస్తే నేరుగా పోలీసు అధికారులకు సమాచారం అందించాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం.
– ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల