
బాలుడి అప్పగింత
కాగజ్‌నగర్‌టౌన్: ఇంటి నుంచి పారిపోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కి జిల్లాకు వచ్చిన మైనర్ బాలుడిని జిల్లా బాలల సంరక్షణ అధికారి బొల్ల మహేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రైల్వే పోలీసులు కాగజ్‌నగర్ స్టేషన్‌లో ఓ రైలులో బాలుడిని గుర్తించి విచారించారు. సికింద్రాబాద్‌లోని పార్శిగుట్ట ప్రాంతం నుంచి అతడు వచ్చినట్లు గుర్తించారు. జిల్లా కేంద్రంలోని బాల రక్షభవన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలుడి తండ్రిని పిలిపించి అప్పగించారు. డీసీపీవో మహేశ్ మాట్లాడుతూ పిల్లల పై నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ బాల ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్ చంద్రశేఖర్ ఉన్నారు.