
రక్షణలో ఆదర్శంగా నిలవాలి
శ్రీరాంపూర్: రక్షణలో ఆదర్శంగా నిలవాలని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. 55వ రక్షణ పక్షోత్సవాల్లో ద్వితీయ బహుమతి సాధించిన ఆర్కే న్యూటెక్ గని ఉద్యోగులను ఆయన అభినందించారు. శుక్రవారం గనిపై నిర్వహించిన ఈ అభినందనలో ఆయన మాట్లాడారు. గని ఉద్యోగులు రక్షణలో ముందున్నారని, ఇతర గనులకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. జాతీయస్థాయిలో ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా సాధించడం మరో మైలు రాయిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, గ్రూప్ ఏజెంట్ కే.రాజేందర్, గని మేనేజర్ కురుపాటి శ్రీనివాస్, ఫిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, రక్షణ అధికారి కొట్టే రమేష్, సీనియర్ సంక్షేమ అధికారి పాల్ సృజన్ పాల్గొన్నారు.