
విధుల్లో ఉన్న అటవీ సిబ్బందిపై దాడి
దండేపల్లి: మండలంలోని లింగాపూర్ అటవీ బీట్‌లో అటవీ, బేస్‌క్యాంపు సిబ్బందిపై దమ్మన్నపేట, మామిడిగూడ గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు శుక్రవారం దాడి చేశారని తాళ్లపేట ఎఫ్‌ఆర్వో సుష్మారావ్ తెలిపారు. పక్కా ప్రణాళికతో కారంచల్లి కర్రలతో దాడి చేశారని, దీంతో భయభ్రాంతులకు గురైన తమ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారని పేర్కొన్నారు. దాడికి గురైన వారిలో ఎఫ్‌ఎస్వో బాలకృష్ణ, బీట్ ఆఫీసర్ పరమేశ్వర్, బేస్‌క్యాంపు వాచ్‌మెన్ రాజేందర్ ఉన్నారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దండేపల్లి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.