
వినూత్న రీతిలో విద్యాబోధన
జన్నారం: అక్కపెల్లిగూడ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం జాజల శ్రీనివాస్ వినూత్న రీతిలో బోధన చేస్తూ విద్యార్థులను ఆకట్టుకుంటున్నాడు. విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేసేందుకు టీఎల్‌ఎం, ఉదాహరణలు వాడుతున్నాడు. నాలుగేళ్ల క్రితం శ్రీనివాస్ పొనకల్‌లో హెచ్‌ఎంగా పని చేసే సమయంలో 30 మంది విద్యార్థుల సంఖ్య ఉండేది. గురుకుల, నవోదయ కోచింగ్‌లు ఇస్తూ అనేక మందిని గురుకుల పాఠశాలల్లో చేరేదుకు కృషి చేయగా దీంతో సంఖ్య 200కు పెరిగింది. గతేడాది అక్కపెల్లిగూడ పాఠశాలకు హెచ్‌ఎంగా బదిలీ అయ్యాడు. అయితే టీచర్ వెంటే మేము అన్నట్లు 180 మంది విద్యార్థులు తిరిగి అక్కపెల్లి గూడ పాఠశాలలో చేరారు. ప్రస్తుతం పాఠశాలలో 314 మంది సంఖ్య ఉంది. శ్రీనివాస్ రెండుసార్లు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు.