
ఆంగ్లంపై పట్టుకు బోధన!
మంచిర్యాలఅర్బన్: విద్యార్థుల బలహీనతలు అధిగమించడానికి, ప్రతిభ పెంచడానికి స్థానిక చెన్నూర్ రోడ్ పాఠశాలకు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయుడు సాంబయ్య ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాడు. ఇంగ్లిష్‌పై పట్టు సాధించేలా కృషి చేస్తున్నారు. గ్రామీణప్రాంతానికి చెందిన దాదాపు 150 మందికిపైగా బీసీ సమీకృత వసతిగృహంలో ఉంటూ చెన్నూర్ రోడ్ పాఠశాలలో చదువుకుంటున్నారు. తెలుగు మీడియం విద్యార్థులు కావడం.. ఆంగ్లంపై ప్రావీణ్యం లేకపోవడంతో చదువుల్లో తడబడ్డారు. ఉపాధ్యాయుడు పాఠశాల సమయం ముగియగానే వసతిగృహంలో తరగతులు బోధిస్తూ వస్తున్నాడు. ఉదయం ప్రత్యేక తరగతులతో ఆంగ్లంలో మెలకువలు నేర్పిస్తున్నాడు.