
విద్యార్థుల సంఖ్య పెంపునకు కృషి..
కాగజ్‌నగర్‌టౌన్: మండలంలోని జీడిచేను ఎంపీపీఎస్ పాఠశాల హెచ్‌ఎం పుల్లూరి బాలకృష్ణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు రెండేళ్లుగా కృషిచేస్తున్నాడు. 20 నుంచి 53 మందిని సంఖ్య పెంచారు. పాఠశాల అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి గ్రామస్తుల సహకారంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. టీచింగ్ లెర్నింగ్ విధానంలో గణితం, సైన్స్, ఇంగ్లిష్ వంటి విషయాలు విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాడు. పిల్లలు బడికి ప్రతీరోజు పాఠశాలకు వచ్చేలా వందశాతం హాజరైన వారికి బహుమతులు అందజేస్తూ డ్రాపౌట్లు లేకుండా చర్యలు
తీసుకుంటున్నాడు. – పుల్లూరి బాలకృష్ణ,
ప్రధానోపాధ్యాయుడు, జీడిచేను, ఎంపీపీఎస్