
బడిని బతికించాడు
దండేపల్లి: మండలంలోని నెల్కివెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో గతేడాది విద్యార్థుల సంఖ్య 5 ఉండేది. బడి మూతపడకుండా ఎలాగైనా బతికించుకోవాలనే ఉద్దేశంతో హె చ్‌ఎం శివప్రసాద్ వేసవి సెలవుల్లో ఇంటింటా తిరి గాడు. మీ పిల్లలను ప్రైవేటుకు పంపద్దు, ప్ర భుత్వ బడికే పంపాలని తల్లిదండ్రులను కో రాడు. బడి పునఃప్రారంభమైన తర్వాత విద్యార్థుల ఇళ్లకు మరోసారి వెళ్లాడు. కొత్త అడ్మిషన్లలో భాగంగా విద్యార్థుల సంఖ్యను 38కి చేర్చాడు. మూతబడే బడిని హెచ్‌ఎం చొరవతో బతికించి ఆదర్శంగా నిలిచాడు. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు పెన్నులు, నోట్‌బుక్స్ తదిర విద్యాసామగ్రిని హెచ్‌ఎం అందిస్తు విద్యార్థులకు సహకరిస్తున్నాడు.