
సైన్స్‌పై మక్కువ పెంచేలా..
కాగజ్‌నగర్ కస్తూర్భా గాంధీ, గురుకుల పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల్లో సైన్స్‌పై మక్కువ పెంచేందుకు ఫిజిక్స్ ఉపాధ్యాయులు ప్రసన్న వినూత్న రీతిలో బోధన చేస్తోంది. జిల్లా, రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌లో వారిని పాల్గొనేలా కృషి చేస్తున్నారు. మూడేళ్లుగా ఉత్తమ ప్రతిభ కనబర్చేలా తీర్చిదిద్దుతున్నారు. గతేడాది జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌లో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. 2023లో హర్యాణలోని ఫరీదాబాద్‌లో నిర్వహించిన ఇండియన్ ఇటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌లో విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు.