
వలకు చిక్కి విలవిల
జిల్లా కేంద్రం సమీపంలోని అక్కాపూర్ గ్రామ చెరువు మత్తడివద్ద ఆదివారం గ్రామస్తులు వేసిన చేపల వలలో పెద్ద కొండచిలువ చిక్కింది. శాంతినగర్ కాలనీకి చెందిన స్నేక్ క్యాచర్ గిరిగంటి అనిల్‌కు సమాచారం అందించడంతో వలను కత్తిరించి కొండచిలువను బంధించాడు. అనంతరం 8 అడుగులున్న పెద్ద కొండచిలువను సురక్షితంగా వల నుండి బయటకు తీసి సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. వర్షాకాలం నేపథ్యంలో చెరువుల వద్ద పాములు సంచరిస్తుంటాయని, పశువులకు, మానవులకూ హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్నేక్ క్యాచర్ అనిల్ సూచించారు.
– నిర్మల్‌ఖిల్లా