
డ్రెయినేజీలో పడి ఒకరు మృతి
భైంసాటౌన్: డ్రెయినేజీలో పడి ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం పట్టణంలో చోటు చేసుకుంది. పో లీసుల కథనం ప్రకారం.. లోకేశ్వరం మండలం పు స్పూర్ గ్రామానికి చెందిన ఒరగంటి సంతోష్ (26) మూడురోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం పట్టణంలోని ఐబీ ప్రాంతంలో డ్రెయినేజీ నుంచి దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిశీలించగా మృతదేహం కనిపించడంతో ఏరియా ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జీ.గోపినాథ్ తెలిపారు.