
స్నానానికి వెళ్లి విద్యార్థి మృతి
కాగజ్‌నగర్‌రూరల్: స్నానానికి వెళ్లి నీటమునిగి విద్యార్థి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సందీప్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి చదువుతున్న రాథోడ్ అంకిత్ (15) ఆదివారం సెలవుదినం కావడంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కోసిని డ్యాంను చూసేందుకు వెళ్లారు. మిగితా ఇద్దరు ఒడ్డుపై ఉండగా అంకిత్ స్నానం చేసేందుకు డ్యాంలోకి దిగాడు. అయితే తూము సమీపంలో లోతు ఎక్కువగా ఉండడంతో నీటిలో గల్లంతయ్యాడు. గమనించిన స్నేహితులు గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఎన్డీఆర్‌ఎఫ్ బృందంతో పాటు గ్రామస్తుల సహకారంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని తండ్రి మోహన్ మండలంలోని నజ్రుల్‌నగర్‌విలేజ్ నెం 5 ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. సంఘటన స్థలాన్ని కాగజ్‌నగర్ సీఐ కుమారస్వామి, ఎంపీడీవో కోట ప్రసాద్ పరిశీలించారు. మృతుని తండ్రి మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.