
చికిత్స పొందుతూ యువకుడు మృతి
జన్నారం: రెండు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు జన్నారం మండలం పొనకల్ గ్రామానికి చెందిన దుమల్ల రాజ్‌కుమార్ (26) జూన్ 16న ధర్మపురి మండలం నేరేల్ల గుట్టల నుంచి వస్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. 75 రోజులపాటు చికిత్స అందించినా పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు.