
గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. సోమవారం ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయ చాంబర్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇంటి నిర్మాణ బిల్లు మంజూరు చేయాలని, అంబులెన్స్‌లో డ్రైవర్‌గా ఉపాధి కల్పించాలని, బోర్‌వెల్, సోలార్ మంజూరు చేయాలని, మృతి చెందిన ఎద్దులకు ఆర్థికసాయం చేయాలని తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీదారులు దరఖాస్తులు చేసుకున్నారు.
ఆహారంలో నాణ్యత పాటించాలి..
ఉట్నూర్ పట్టణంలో సమీకృత గిరిజన అభివద్ధి సంస్థ –జంగుబాయి గ్రూపు సభ్యులు నిర్వహిస్తున్న గిరిజన క్యాంటీన్‌లో ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించాలని పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. సోమవారం గిరిజన క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి సామగ్రి, పరిసరాలు పరిశీలించారు. భోజనం చే స్తున్న వారిని నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నా రు. అనంతరం ఉట్నూర్ కేంద్రంలో ఐటీడీఏ ద్వారా నిర్వహిస్తున్న పెట్రోల్ బంకును పీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో జంగుబాయి గ్రూపు సభ్యులు శేఖర్, టోకెన్ ఇన్‌చార్జి అనిల్ యాదవ్, బంక్ మేనేజర్ నవజ్యోత్ పాల్గొన్నారు.
ల్యాప్‌టాప్‌లు పంపిణీ..
ప్రాజెక్టు అధికారి చాంబర్‌లో ఉన్నత విద్య కోర్సులలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన గిరిజన విద్యార్థులకు ప్రోత్సాహకంగా ల్యాప్‌టాప్‌లను ఖష్బూ గుప్తా అందించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని పట్టుదలతో సాధించాలని ఆకాంక్షించారు.