
ప్రకృతి సోయగం... మిట్టే జలపాతం
దట్టమైన అడవిలో ప్రకృతి సోయగాల నడుమ మిట్టే (సప్తగుండాలు) జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో రామ గుండం, లక్ష్మణ గుండం, సీత గుండం, భీమ గుండం, సవతిగుండం, చిరుతల గుండం, బుగ్గ గుండం ఉన్నాయి. సప్త గుండాలను కలిపి మిట్టే జలపాతంగా పిలుస్తారు. పూర్వం రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసానికి వచ్చిన సమయంలో ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకున్నట్లు పూర్వీకులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. – లింగాపూర్

ప్రకృతి సోయగం... మిట్టే జలపాతం

ప్రకృతి సోయగం... మిట్టే జలపాతం

ప్రకృతి సోయగం... మిట్టే జలపాతం