
‘ఇసుక అక్రమ రవాణాకు తావులేదు’
కోటపల్లి: మండలంలోని ఎర్రాయిపేట ఇసుక క్వారీలో ఎలాంటి అక్రమ రవాణా జరగడంలేదని మైనింగ్ ఏడీ జగన్మోహన్ రెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం పార్‌పల్లి జాతీయ రహదారిపై టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక క్వారీ చెక్‌పోస్టును సందర్శించారు. మైనింగ్ ఏడీ మాట్లాడుతూ మండలంలోని ఇసుక క్వారీల్లో 24గంటలు మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారుల తనిఖీలతో పకడ్భందీగా ఇసుక తరలిస్తున్నామని, ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా నిర్వహణ చేపడుతున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ లో లారీల్లో ఇసుకలోడ్ జరుగుతుందని, అక్ర మ రవాణా జరుగుతుందని వస్తున్న వదంతులను నమ్మవద్దన్నారు. ఇసుక లోడింగ్ నిలిచి పోవడంతో లారీలు పెద్దఎత్తున ఆగాయని, వా టిని కూడా పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చే స్తామన్నారు. కార్యక్రమంలో సీఐ దేవేందర్‌రావు, ఎస్సై రాజేందర్, తహసీల్దార్ రాఘవేందర్‌రావు, డీటీ నవీన్‌కుమార్ పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ విద్యార్థి మృతి
మందమర్రిరూరల్: మందమర్రి రైల్వేస్టేషన్‌లో ఆదివారం రైలులోంచి కిందపడిన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం బోదన్‌పల్లికి చెందిన ఐటీఐ విద్యార్థి చింతపూడి కార్తీక్ (17) చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు. మృతుడు కార్తీక్ తన తల్లి భీమక్కతో కలిసి కాజీపేట నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తుండగా మందమర్రి రైల్వేస్టేషన్ వద్ద కాలుజారి కిందపడ్డాడు. గాయాలు కావడంతో మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భీమక్క ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహన్ని అప్పగించినట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.