
ఏరియాస్థాయి స్ట్రక్చరల్ సమావేశం
శ్రీరాంపూర్: సింగరేణి యజమాన్యానికి, గుర్తింపు సంఘం ఏఐటీయూీసీ నాయకుల మధ్య సోమవారం ఏరియా స్థాయి స్ట్రక్చరల్ సమావేశం జరిగింది. జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో జీఎం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో యూనియన్ నాయకులు పలు డిమాండ్లపై చర్చించారు. ఏరియాలో సర్ఫేస్ డిపార్టుమెంట్‌లో ఖాళీ ఉన్న జనరల్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రిటైర్డ్ క్‌లైములను వెంటనే సెటిల్ చేసి డబ్బులను చెల్లించాలని, టింబర్ వర్క్‌మెన్ డిజిగ్నేషన్‌ను మార్చి కేటగిరీ ఉద్యోగులుగా పరిగణించాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ఎస్‌వోటు జీఎం ఎన్.సత్యనారాయణ, డీజీఎం(పర్సనల్) ఎస్.అనిల్‌కుమార్, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, యూనియన్ ప్రతినిధులు కొట్టే కిషన్‌రావు, మోత్కూరి కొమురయ్య, చంద్రమోహన్, బద్రి బుచ్చయ్య, సంపత్, తదితరులు పాల్గొన్నారు.