మంచిర్యాలఅగ్రికల్చర్: పాత పింఛన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పింఛన్ పద్ధతిని అమలు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం(టీఎస్‌జీఆర్‌ఈఏ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కొత్త విధానంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. కొత్త పింఛన్ విధానాన్ని రద్దు చేయాలని ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు క్రిష్ణ, శంకర్, విక్రమ్, వైకుంఠం, సత్యనారాయణ, పాపరావు, రాంరెడ్డి, లింగం, రాజనర్స, దుర్గప్రసాద్, తిరుపతి, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.