
సైకిల్‌ను ఢీకొట్టిన ఆటో
జన్నారం: సైకిల్‌ను ఆటో ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందా డు. జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై రాజవర్దన్ కథ నం ప్రకారం.. మండలంలోని అక్కపెల్లిగూడకు చెందిన గోలి రా జన్న (55) పాత ఇనుప సామాను దుకాణంలో పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి పని ముగించుకుని సైకిల్‌పై ఇంటికి వస్తున్నాడు. జన్నారం వైపు వస్తున్న ఆటో వెనుకవైపు నుంచి సైకిల్‌ను ఢీకొట్టడంతో రాజన్నకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని అతన్ని జన్నారంలో ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం లక్సెట్టిపేట ఆసుపత్రికి పంపించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన ఆటో బాదవత్ జనంత్‌రావుకు చెందినదిగా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి భార్య కళావతి ఫిర్యాదుతో శనివారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉండగా పెళ్లయింది.