
విద్యుత్ షాక్‌తో పశువులు మృతి
లక్ష్మణచాంద: మండలంలోని పార్‌పెల్లితండాలో విద్యుత్ షాక్‌తో గేదె మృతిచెందింది. గేదె ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం మేతకు వెళ్లి ంది. తిరిగి సాయంత్రం ఇంటికి రాకపోవడంతో రైతు బానావత్ రాంజీ చుట్టూపక్కల వెతి కాడు. శనివారం అటు వైపుగా వెళ్లిన గ్రామస్తులకు గేదె మృతి చెంది కనిపించడంతో రైతుకు సమాచారమిచ్చారు. మేత మేసేక్రమంలో వి ద్యుత్ షాక్ తగలి మృతి చెందినట్లు గుర్తించా రు. దీని విలువ రూ.55 వేలు ఉంటుందని ప్ర భుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.
దిలావర్‌పూర్‌లో..
దిలావర్‌పూర్: మండల కేంద్రానికి చెందిన రైతు నంద ముత్యం ఎద్దు శనివారం విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. ఎప్పటిలాగే తన పంటచేలకు ఎడ్లబండితో వెళ్లి అక్కడ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. మేతకోసం ఎద్దులను పొలంలో ఉంచగా ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లింది. అక్కడ 11 కేవీ విద్యుత్ తీగలకు ఎద్దు తోక తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. ఎద్దు కిందపడిపోగానే అక్కడకు చేరుకున్న రైతు ఏం జరిగిందో తెలియక వేలాడుతున్న విద్యుత్ తీగను చూసి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే విద్యుత్ సరఫరా నిలుపుదల చేయాలని అధికారులకు సమాచారమిచ్చారు. మృతి చెందిన ఎద్దు విలువ రూ.80 వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు.
కడెంలో..
కడెం: మండలంలోని అల్లంపల్లి జీపీ పరిధి పాలరేగడి గ్రామ గిరిజన రైతు పెంద్రం మధుకు చెందిన ఆవు విద్యుత్ షాక్‌తో మృతిచెందింది. దత్తోజిపేట సమీపంలో శుక్రవారం ఆవు మేతకు వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తుండగా ట్రాన్స్‌ఫార్మర్ విద్యుత్ తీగలకు తగిలి షాక్‌తో మృతిచెందింది. దీని విలువ రూ.40 వేలు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతు వేడుకున్నాడు.

విద్యుత్ షాక్‌తో పశువులు మృతి

విద్యుత్ షాక్‌తో పశువులు మృతి