
బాక్సింగ్ చాంపియన్లుగా నిలవాలి
మంచిర్యాలటౌన్: బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులు చాంపియన్లుగా నిలిచి, జాతీయస్థాయిలోనూ రాణించాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కీర్తిరాజ్‌వీర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సీఏ ఫంక్షన్ హాల్‌లో ఉమ్మడి జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ పర్యవేక్షణలో టైసన్ కప్–2025 చాంపియన్‌షిప్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలను శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈనెల 26వ తేదీ వరకు నిర్వహించనున్న బాక్సింగ్ పోటీలకు రాష్ట్రస్థాయి నుంచి 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పురుషోత్తం నాయక్, నిర్వాహకుడు చిలువేరు రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

బాక్సింగ్ చాంపియన్లుగా నిలవాలి