
ఎస్టీపీపీలో వర్క్స్ కమిటీ సమావేశం నిర్వహించాలి
జైపూర్: ఎస్టీపీపీలో వర్క్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అ ధ్యక్షుడు రియాజ్ అ హ్మద్ పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. 2016–20 వరకు స్టీగ్ కంపెనీ నుంచి కార్మికులకు ఫుల్‌అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. ఒక్కో కార్మికుడికి రూ.70వేలకు పైగా వస్తాయని, ఆ డబ్బులు సి ంగరేణి యాజమాన్యం కాజేసిందా అని ప్రశ్నించారు. పవర్‌మేక్ కంపెనీ సబ్ కాంట్రాక్టు వీ వీఆర్ అనే కంపెనీ 2016–23 వరకు కార్మికులకు ఫుల్‌అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయలేదన్నారు. కంపెనీ నిబంధనలు ప్రకారం బోసన్ 8.33 ఇవ్వాలని అలా చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. పవర్‌మేక్ కంపెనీ వెంటనే డబ్బులు చెల్లించాలని లేకపోతే కార్మి కులు ఆందోళన చేపడుతారని హెచ్చరించారు.
పులిని హతమార్చిన
30 మంది అరెస్టు
కాగజ్‌నగర్‌టౌన్: పెంచికల్‌పేట మండలంలో ని ఎల్లూరు అటవీప్రాంతంలో విద్యుత్ తీగల ఉచ్చుతో పులిని హతమార్చిన 30 మందిని శని వారం అరెస్టు చేసినట్లు కాగజ్‌నగర్ ఫారెస్టు డి విజన్ అధికారి సుశాంత్ సుఖ్‌దేవ్ బోబాడే తెలి పారు. అప్పాజి శ్రీనివాస్, వెంకటేశ్,ఎల్కరి శే ఖర్, రోహిని శ్రావణ్, చప్పిడె అశోక్, పవన్‌కుమార్,ఎల్కరి ప్రకాశ్, వెంకటేశ్, కాటెల సాగర్, నికాడి వెంకటేశ్, లా త్కరి శ్రీనివాస్, భీంకరి వెంకటేశ్, భీంకరి రంగయ్య, లేగల గోపాల్, రాచకొండ లచ్చయ్య, ఓండ్రె సంతోశ్, తుమ్మి డె శ్రీనివాస్, ఎల్కరి సుగుణాకర్, బుర్రి తిరుపతి, ఓండ్రె నారాయణ, లేగల వెంకటేశ్, గో మాసు రాజన్న, మడె మధునయ్య, లేగల స త్యనారాయణ, ఎల్లూరి లచ్చన్న, మౌల్కార్ ది వాకర్, బిన్కర్ తిరుపతి, తుమిడె సత్తయ్య, పె ద్దల నీలయ్య, గావుడె శంకర్ ఉన్నారన్నారు. సిర్పూర్(టి) సివిల్‌కోర్టులో హాజరుపర్చామ ని, 14 రోజుల జ్యుడిషీయల్ కస్టడీ విధించగా, ఆసిఫాబాద్ జైలుకు తరలించినట్లు తెలిపారు.