
కార్మికులకు అండగా ఉండాలి
శ్రీరాంపూర్: కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉండాలని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్‌ప్రసాద్ తెలిపారు. శుక్రవారం రాత్రి రసూల్‌పల్లెలోని తన నివాసంలో శ్రీరాంపూర్ డివిజన్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఏ సమస్య వచ్చినా యజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. కార్మికుల చిరకాల వాంఛ అయిన సొంతింటి పథకం అమలు కోసం కృషి చేస్తున్నామన్నారు. అలవెన్స్‌లపై ఆదాయ పన్ను రీయింబర్స్‌మెంట్, రూ.25 లక్షల వడ్డీ లేని రుణం తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎన్నికల వేళ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులకు యూనియన్ పదవులు అప్పగించి నియామకపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ బ్రాంచి ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్‌రావు, కేంద్ర కమిటీ నాయకులు భీంరావు గరిగే స్వామి, కలవేన శ్యామ్, ఏనుగు రవీందర్‌రెడ్డి, జీవన్‌జోయల్, తిరుపతిరాజు, నాయకులు పేరం రమేశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.