
విద్యుత్ షాక్‌తో మూగజీవాలు..
భైంసారూరల్: మండలంలోని కుంసరలో శుక్రవా రం విద్యుత్‌షాక్‌తో ఎద్దు మృతి చెందిన ఘటన చో టు చేసుకుంది. గ్రామానికి చెందిన భూమన్న ఎద్దు గ్రామ శివారులోని పంట చేనులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ తీగలకు విద్యుత్ సరఫరా కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపా రు. ఎద్దు విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని, ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవా లని బాధిత రైతు భూమన్న వేడుకుంటున్నాడు.
గొల్లమాడలో మేక..
నర్సాపూర్(జి): మండలంలోని గొల్లమాడలో విద్యుత్‌షాక్‌తో మేక మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మస్కిరి లక్ష్మణ్ గ్రామ శివారులో మేకలు మేపుతుండగా తక్కువ ఎత్తులో, కంచె లేని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. పశు వైద్యాధికారి ముక్తార్ అహ్మద్ పంచనామా నిర్వహించారు. ప్రభుత్వం పరిహారం అందించాలని బాధితుడు కోరుతున్నాడు.
బోథ్: మండలంలోని కౌట(బీ)లో పడిగెల చిన్న భీముడుకు చెందిన గేదె విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. రెండు రోజులుగా గాలులతో కూడిన వర్షాల కారణంగా గ్రామ సమీపంలోని పంట పొలాల మీదుగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్‌కు చెందిన తీ గలు తెగి కింద పడిపోయాయి. మేతకు వెళ్లిన గేదె వైర్లను తాకడంతో మృతి చెందింది. గేదె విలువ సు మారు రూ.70 వేలు ఉంటుందని, ప్రభుత్వమే త మను ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.

విద్యుత్ షాక్‌తో మూగజీవాలు..