
ఇద్దరిపై గంజాయి కేసు
భీంపూర్: మండలంలోని తాంసి(కే) గ్రామంలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం ఎస్సై పీర్ సింగ్, సిబ్బందితో కలిసి శుక్రవారం దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన మంచికంటి అశోక్, ఓంకార్ల వ్యవసాయ భూమిలో సాగు చేస్తున్న 30 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
ఆరుగురి బైండోవర్
ఖానాపూర్: మండలంలో పలుచోట్ల ఎకై ్సజ్ కేసుల్లో పట్టుబడిన ఆరుగురిని శుక్రవారం తహసీల్దార్ సుజాత ఎదుట బైండోవర్ చేసినట్లు ఎకై ్సజ్ ఎస్సై అభిషేకర్ తెలిపారు. నాటుసారా తయారు చేసినా, విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైండోవర్ ఉల్లఘించిన వారికి రూ.2లక్షల జరిమానా లేదా రెండేళ్ల జైలుశిక్ష విధిస్తారని తహసీల్దార్ తెలిపారు. సిబ్బంది వెంకటేష్, ఇర్ఫాన్, సాయన్న, కల్పన పాల్గొన్నారు.
బెదిరింపులకు
పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు
ఇంద్రవెల్లి: బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఉట్నూర్ సీఐ మొగిలి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతమైన ఇంద్రవెల్లి మండల కేంద్రంలో చంపత్‌రావు నిర్మించిన వాణిజ్య నిర్మాణంపై మెస్రం ఆనందరావు, గవందే బిపిన్‌కుమార్ 2023లో ఐటీడీఏ కోర్టులో ఫిర్యాదు చేశారన్నారు. ఇరువురు చంపత్‌రావును కలిసి ఫి ర్యాదును వెనక్కి తీసుకునేందుకు రూ.2లక్షలు వసూలు చేశారని, ఇంద్రవెల్లి పబ్లిక్ స్కూ ల్ యజమాని వద్ద అదే సంవత్సరంలో రూ. 2లక్షలు వసూలు చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని సీఐ తెలిపారు. ఈ ఇరువురు నిందితులు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనేతరులందరినీ కలిసి తమకు రూ.20 లక్షల ఇవ్వాలని, లేనిపక్షంలో ఐటీడీఏ కోర్టులో కేసులు నమో దు చేయిస్తామని బెదిరింపులకు పాల్పడిన ట్లు పేర్కొన్నారు. మెస్రం ఆనంద్‌రావుతో పా టు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని మరికొంత మంది గిరిజనేతరులకు నోటీసులు పంపడం జరిగిందని తమ విచారణలో బహిర్గతమైందన్నారు. ఇరువురిని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

ఇద్దరిపై గంజాయి కేసు