పులిని హతమార్చిన ఘటనలో 30 మంది రిమాండ్
పెంచికల్‌పేట్/దహెగాం: పెంచికల్‌పేట్ మండలం ఎల్లూర్ అటవీ ప్రాంతంలో ఈ నెల 15న వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చి పెద్దపులిని హతమార్చిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం విధితమే. ఈ ఘటనపై అటవీ శాఖ ప్రత్యేక బృందాలు వారం రోజులుగా నిందితులను గుర్తించేందుకు విచారణ చేపట్టాయి. ఈ ఘటనలో పెంచికల్‌పేట్, దహెగాం మండలాలకు చెందిన 30 మంది పాల్గొన్నట్లు నిర్ధారించారు. శుక్రవారం సిర్పూర్(టి) కోర్టులో దహెగాం, పెంచికల్‌పేట్ మండలాలకు చెందిన 30 మందిని హాజరుపర్చగా.. నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించినట్లు డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ టిబ్రేవాల్ తెలిపారు.


