సర్పంచ్ అభ్యర్థికి అస్వస్థత
● ఆస్పత్రికి.. ఆ తర్వాత పోలింగ్ కేంద్రానికి..
బెల్లంపల్లి: తాండూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మాస వెంకటస్వామి అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్సతో తేరుకుని గంటల వ్యవధిలోనే మళ్లీ పోలింగ్ కేంద్రానికి చేరాడు. ఆదివారం ఉదయం 8గంటల ప్రాంతంలో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన ఛాతిలో నొప్పి వస్తోందంటూ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే మంచిర్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఆయన ఉదయం 11గంటలకు మళ్లీ పోలింగ్ కేంద్రంలో ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఓటర్లు అవాక్కయ్యారు. ఏం జరిగిందో తెలియదు గానీ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరడం, పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది.
నాలుగుసార్లు సర్పంచ్
కాసిపేట: మండలంలోని పల్లంగూడకు చెందిన దుస్స విజయ–చందు దంపతులు నాలుగు పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నికై గ్రామంలో తమ పేరు పదిలపర్చుకున్నారు. రిజర్వేషన్లకు అనుగుణంగా దుస్స చందు ఒక్కసారి సర్పంచ్‌గా ఐదేళ్లు పని చేశాడు. అతని భార్య దుస్స విజయను జనరల్, బీసీ స్థానాల్లో నిలుపుతూ మూడుసార్లు గెలిపించాడు. మధ్యలో ఒకసారి ఎస్సీ రిజర్వేషన్ రాగా తనకు నచ్చిన అభ్యర్థినే గెలిపించుకున్నాడు. ఏదిఏమైనా గ్రామంలో అభివృద్ధి సమస్యలతో వ్యతిరేకత ఎదుర్కొనే నాయకుల్లో ఉన్న ఈ రోజుల్లో నాలుగుసార్లు గెలవడం విశేషం.
సర్పంచ్ అభ్యర్థికి అస్వస్థత
సర్పంచ్ అభ్యర్థికి అస్వస్థత


