రాజారంలో ఉపసర్పంచే సర్పంచ్!
వేమనపల్లి: మండలంలోని రాజారంలో ఉపసర్పంచ్‌గా ఎన్నికై నవారికే సర్పంచ్ గౌరవం దక్కనుంది. 320 ఓటర్లున్న ఈ పంచాయతీని ఎస్సీలకు కేటాయించారు. గ్రామంలో ఎస్సీలెవరూ లేనందున సర్పంచ్ ఎన్నిక నిర్వహించలేదు. ఎస్సీలకు కేటాయించిన 1, 2, 3 వార్డుల్లోనూ ఎస్సీలు లేనందున వీటికీ ఎన్నిక జరగలేదు. మిగతా 4,5,6 వార్డులకే ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ బలపరిచిన నాలుగో వార్డు అభ్యర్థి కొద్దని శంకరమ్మ గెలుపొందింది. 5, 6 వార్డులకు బీఆర్‌ఎస్ బలపరిచిన ఎనగంటి మల్లీశ్వరి, గాదర్ల బీరయ్య విజయం సాధించారు. వీరిలో ఎనగంటి మల్లీశ్వరి ఉపసర్పంచ్‌గా ఎన్నిక కానున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నిక లేనందున ఇక్కడ ఉపసర్పంచ్‌కే ఇన్‌చార్జి బాధ్యతలు, చెక్ పవర్ అప్పగించి పాలక వర్గాన్ని కొనసాగించనున్నారు.


