ఓటేసిన కొత్త ఓటర్లు
వేమనపల్లి: మండలంలో పలువురు కొత్త ఓటర్లు తొలిసారిగా ఓటు వేశారు. ఉన్నత చదువుల కోసం వివిధ ప్రాంతాల్లో ఉంటున్నవారంతా ఆదివారం పల్లెబాట పట్టారు. సొంతూళ్లకు వచ్చి పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా తొలిసారి ఓటేసిన పలువురు యువ ఓటర్ల మనోగతం వారి మాటల్లో..
ఇష్టమైన నాయకుడిని ఎన్నుకోవాలి
మా ఊరిలో ఓటేయటం మంచి అనుభూతినిచ్చింది. వరంగల్‌లో డిగ్రీ చదువుతున్న. ఎలాగైనా ఓటెయ్యాలనే తపనతో వేమనపల్లికి వచ్చాను. మంచి వ్యక్తికి ఓటు వేసి సమాజానికి నా వంతు సహాయం చేయాలనుకున్న. అందరూ ఓటేసి ఇష్టమైన నాయకున్ని ఎన్నుకోవాలి. – నాగుల నవీన్‌కుమార్
హైదరాబాద్ నుంచి వచ్చా..
హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న. ఓటు కోసం గ్రా మానికి వచ్చాను. చిన్నప్పు డు ఓటేసేందుకు మా డాడీ వాళ్లతో ఎడ్లబండ్ల మీద వెళ్లెటోన్ని. వాళ్లు వెళ్తూ ఉంటే మేం ఆసక్తిగా చూసేది. ప్రత్యక్షంగా ఓటేయటం నిజంగా ఆనందాన్నిచ్చింది. పొద్దంతా క్యూలైన్‌లో ఉండి ఓటేసిన. – వాంగ్మయ్‌రెడ్డి, వేమనపల్లి
సెలవు పెట్టి వచ్చా
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న. శనివారం సెలవు పెట్టి ఓటు కోసం మా ఊరికి వచ్చాను. నా ఓటు కోసం చాలా మంది అభ్యర్థులు ఫోన్లు చేశారు. సమాజానికి మంచి చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని స్వచ్ఛందంగా వచ్చి నచ్చిన వ్యక్తికి ఓటేశాను.
– పుప్పిరెడ్డి రూప, సాఫ్ట్‌వేర్, మంగనపల్లి
ఓటేసిన కొత్త ఓటర్లు
ఓటేసిన కొత్త ఓటర్లు


