● 111 పంచాయతీల్లో రెండోవిడత పోలింగ్‌ ● క దిలిన పల్లెలు.. 84.59శాతం నమోదు ● కన్నెపల్లిలో అత్యధికంగా 90.37.. తాండూర్‌లో అత్యల్పంగా 78.52శాతం ● కేంద్రాలను సందర్శించిన అధికారులు ● ప్రశాంతంగా ముగిసిన జీపీ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

● 111 పంచాయతీల్లో రెండోవిడత పోలింగ్‌ ● క దిలిన పల్లెలు.. 84.59శాతం నమోదు ● కన్నెపల్లిలో అత్యధికంగా 90.37.. తాండూర్‌లో అత్యల్పంగా 78.52శాతం ● కేంద్రాలను సందర్శించిన అధికారులు ● ప్రశాంతంగా ముగిసిన జీపీ ఎన్నికలు

Dec 15 2025 10:09 AM | Updated on Dec 15 2025 10:09 AM

● 111

● 111 పంచాయతీల్లో రెండోవిడత పోలింగ్‌ ● క దిలిన పల్లెలు.

● 111 పంచాయతీల్లో రెండోవిడత పోలింగ్‌ ● క దిలిన పల్లెలు.. 84.59శాతం నమోదు ● కన్నెపల్లిలో అత్యధికంగా 90.37.. తాండూర్‌లో అత్యల్పంగా 78.52శాతం ● కేంద్రాలను సందర్శించిన అధికారులు ● ప్రశాంతంగా ముగిసిన జీపీ ఎన్నికలు

కాసిపేట: దేవాపూర్‌లో ఓటేసేందుకు క్యూలో నిల్చున్న ఓటర్లు

బెల్లంపల్లి: రెండోదశ గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. 84.59 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో బెల్లంపల్లి, తాండూర్‌, కాసిపేట, నెన్నెల, భీమిని, వేమనపల్లి, కన్నెపల్లి మండలాల్లో 114 గ్రామపంచాయతీలుండగా వీటిలో కాసిపేట, కన్నెపల్లి మండలాల్లోని ధర్మరావుపేట, ముత్తాపూర్‌ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. వేమనపల్లి మండలం రాజారం గ్రామపంచాయతీని ఎస్సీలకు రిజర్వ్‌ చేయడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో సర్పంచ్‌ ఎన్నికలు అక్కడ నిలిచిపోగా మూడు జనరల్‌ వార్డులకు పోలింగ్‌ జరిగింది. మిగతా 111 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.

అత్యధికం కన్నెపల్లి.. అత్యల్పం తాండూర్‌

పోలింగ్‌ జరిగిన ఏడు మండలాల పరిధిలో 1,37,382 మంది ఓటర్లున్నారు. వీరిలో 1,16,205 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 68,179 మంది పురుషులకు గాను 58,179 మంది, 69,195మంది మహిళలకు గాను 58,023 మంది, ఎనిమిది మంది ఇతరులకు గాను ముగ్గురు ఓటు వేశారు. పురుషుల కంటే మహిళల ఓటింగ్‌ శాతం కాస్త తగ్గింది. అత్యధికంగా కన్నెపల్లి మండలంలో 90.37శాతం, అత్యల్పంగా తాండూర్‌ మండలంలో 78.52 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. చలిని లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు గుంపులుగుంపులుగా వచ్చారు. మధ్యాహ్నం 12గంటల వరకే మెజార్టీ ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

కేంద్రాలను పరిశీలించిన అధికారులు

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ప్రకటించారు. ఎన్నికలు అధికారులు ఆయా గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల, నెన్నెల, తాండూర్‌ మండలం బోయపల్లి పోలింగ్‌ కేంద్రాలను రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా, వేమనపల్లి, నీల్వాయి పోలింగ్‌ కేంద్రాలను అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య, బుదాకలాన్‌, మాదారం, రాజీవ్‌నగర్‌ పోలింగ్‌ కేంద్రాలను బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, కిష్టంపేట, ముత్యంపల్లి, కాసిపేట పోలింగ్‌ కేంద్రాలను డీపీవో వెంకటేశ్వర్‌రావు, తాళ్లగురిజాల, పాతబెల్లంపల్లి, చంద్రవెల్లి, చాకేపల్లి, బోయపల్లి, కిష్టంపేట, తాండూర్‌జన్కాపూర్‌ పోలింగ్‌ కేంద్రాలను డీపీసీ భాస్కర్‌ సందర్శించారు.

నెన్నెల: మండల కేంద్రంలో వీల్‌చైర్‌లో

వృద్ధురాలిని తీసుకువస్తున్న పోలీసులు

నెన్నెల: మండల కేంద్రంలో ఓటేసినట్లు

వేలు చూపిస్తున్న వృద్ధులు

భీమిని: జన్కాపూర్‌లోని పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీసీపీ

బెల్లంపల్లిరూరల్‌: బుధాకలాన్‌లో పోలింగ్‌ తీరును పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌

● 111 పంచాయతీల్లో రెండోవిడత పోలింగ్‌ ● క దిలిన పల్లెలు.1
1/6

● 111 పంచాయతీల్లో రెండోవిడత పోలింగ్‌ ● క దిలిన పల్లెలు.

● 111 పంచాయతీల్లో రెండోవిడత పోలింగ్‌ ● క దిలిన పల్లెలు.2
2/6

● 111 పంచాయతీల్లో రెండోవిడత పోలింగ్‌ ● క దిలిన పల్లెలు.

● 111 పంచాయతీల్లో రెండోవిడత పోలింగ్‌ ● క దిలిన పల్లెలు.3
3/6

● 111 పంచాయతీల్లో రెండోవిడత పోలింగ్‌ ● క దిలిన పల్లెలు.

● 111 పంచాయతీల్లో రెండోవిడత పోలింగ్‌ ● క దిలిన పల్లెలు.4
4/6

● 111 పంచాయతీల్లో రెండోవిడత పోలింగ్‌ ● క దిలిన పల్లెలు.

● 111 పంచాయతీల్లో రెండోవిడత పోలింగ్‌ ● క దిలిన పల్లెలు.5
5/6

● 111 పంచాయతీల్లో రెండోవిడత పోలింగ్‌ ● క దిలిన పల్లెలు.

● 111 పంచాయతీల్లో రెండోవిడత పోలింగ్‌ ● క దిలిన పల్లెలు.6
6/6

● 111 పంచాయతీల్లో రెండోవిడత పోలింగ్‌ ● క దిలిన పల్లెలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement